గురు పౌర్ణమి సందర్భంగా ఆంధ్ర షిర్డి సాయి మందిర్‌కు పోటెత్తిన భక్తజనం
తూర్పుగోదావరి జిల్లా: బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఆంధ్ర షిర్డిగా ప్రసిద్ధి చెందిన సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి సాయినాథుని దివ్య దర్శనం చేసుకుని గురుకృపను పొందారు. ఉదయం వేళ కాకడ హారతితో ప్రారంభమైన కార్యక్రమాలు గణపతి పూజ, శ్రీచక్ర పూజలతో కొనసాగాయి. అనంతరం సాయిబాబా మూలవిరాటుకు 1008 లీటర్ల ఆవుపాలతో మహా పాలాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వయంగా పాలాభిషేకంలో పాల్గొని...