POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 5:23 pm Posted by : POLITICAL POWER

బీజేవైఎం అధ్యక్షులు శేషంక్ సింగ్  రాహుల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు గొడుగుల పంపిణీ.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.

కీసర సర్కిల్ : జవహర్ నగర్ :  ఈ రోజు మేడ్చల్ రూరల్ జిల్లా జవహర్ నగర్ డివిజన్ లో బీజేవైఎం అధ్యక్షులు శశాంక్ సింగ్ (రాహుల్) మరియు డివిజన్ బిజెపి అధ్యక్షులు కళికోట కమలాకర్ సమక్షంలో వర్షకాలం ఉన్నందున వానలో, ఎండలో కష్ట పడి పని చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు గొడగులు పంపిణి చేయడం జరిగింది.ఈ సందర్భంగా రాహుల్   మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికుల గురుంచి మాట్లాడుతూ గత బి.ఆర్.ఎస్. మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు జవహర్ నగర్ పరిశుద్ధ కార్మికుల విషయం లో నిర్లక్ష్యంగా ఉన్నారు అని తెలిపారు.                      జవహర్ నగర్ గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ కార్పొరేషన్ గా మారిన ఆ తరువాత మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) మారిన వీళ్ళ జీవితాల్లో మార్పు లేదు…                  8 సంవత్సరాలు కావస్తున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఇప్పటివరకు పరిశుద్ధ కార్మికుల విషయంలో మాట్లాడలేదు మరియు న్యాయం చేయలేదు. జీతాలు పెంచడం లేదు, ఉద్యోగం పర్మనెంట్ చేయడం లేదు.                                           మౌలిక వస్తువులు, గ్లౌజ్, బూట్స్, రైన్ కోట్స్ మాస్క్స్, అందటం లేదు, డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు, పెన్షన్ లేదు. కావున వీళ్ళయినంత తొందర్లో వీళ్లకు న్యాయం జరగాలి అని కోరారు.

ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశిస్తూ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు మరియు మన ఇంటిని శుభ్రం పెట్టుకున్నట్టు మన గల్లీ మన కాలనీ మన ఊరు ని శుభ్రంగా ఉంచుకోవాలి, రోగాలతో మనల్ని మనము కాపాడుకోవాలి అని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు తులసి రామ్, అమర్ దేవత రాజ్,రవి ముదిరాజ్, కాశంపుర అనిల్, అరుణ్ కుమార్, ప్రశాంత్ మరియు తదితరాలు పాల్గొన్నారు.