ఆగస్టు 15 సందర్భంగా నారాయణ స్కూలులో ఫ్యాన్సీ డ్రెస్ పోటీ

  స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో అలరించిన చిన్నారులు అనపర్తి: ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అనపర్తిలోని నారాయణ ఇ-టెక్నో ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలో చిన్నారులకు జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణ పోటీని ఘనంగా నిర్వహించారు. జీఎం విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన, ప్రిన్సిపాల్ నందకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏజీఎం అలీషా, ఇ-కిడ్జ్ ఆర్‌అండ్‌డీ హెడ్ సునీత, కో-ఆర్డినేటర్ హరిత పాల్గొన్నారు. చిన్నారులు వివిధ జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో అలరించారు. దేశం కోసం అహర్నిశలు...