ఎల్ నినో ప్రభావం తో రైతులు నష్టపోకూడదు
బిక్కవోలు, ఆగస్టు 18: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు, ఊలపల్లి గ్రామాల్లో మంగళవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్‌సీ ఏడీఏ ఎస్. జయరామలక్ష్మి, జిల్లా వ్యవసాయ కార్యాలయ టెక్నికల్ ఏవో కే. సూర్యరమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏడీఏ ఎస్. జయరామలక్ష్మి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటను కాపాడుకునేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పంట సంరక్షణ చర్యలు పాటించాలని,...