రుద్రూర్ లో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు.
- విఠలేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిజామాబాదు జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 25 జూలై 2026. రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర స్వామి దేవాలయంలో శనివారం నాడు భక్తులు తొలి ఏకాదశి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రుక్మిణి సమేత విఠలేశ్వర స్వామి ఆలయానికి ఉదయం నుండే భక్తులు పోటెత్తారు.. అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది....