POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 8:10 am Posted by : POLITICAL POWER

బిక్కవోలులో ఫుట్ పట్రోలింగ్ – ట్రాఫిక్ సౌకర్యానికి పోలీసుల ప్రత్యేక చర్యలు

పొలిటికల్ పవర్ జాతీయతెలుగు దినపత్రిక

బిక్కవోలు, జూలై 18: బిక్కవోలు గ్రామ ప్రధాన రహదారిపై ఎస్సై రవిచంద్రకుమార్ ఆధ్వర్యంలో బిక్కవోలు పోలీసులు శుక్రవారం ఫుట్ పట్రోలింగ్ నిర్వహించి ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. రహదారులను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు.
అదేవిధంగా రహదారులపై నిబంధనలకు విరుద్ధంగా పార్క్ చేసిన వాహనాలను తొలగించి, ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టారు. వాహనదారులు తమ వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపివేయాలని, రహదారులను ఆక్రమించకుండా పోలీసులకు సహకరించాలని ఎస్సై రవిచంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు.
ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ను సాఫీగా సాగేందుకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇటువంటి ఫుట్ పట్రోలింగ్, ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్సై రవిచంద్రకుమార్ తెలిపారు.