కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆపిన కాంగ్రెస్ పై మాజీ ఎమ్మెల్యే తాటి ఫైర్
“తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగులుతుంది” – తాటి వెంకటేశ్వర్లు పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, ఆగస్టు 17: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ఆడబిడ్డలు ఆనందంగా జీవించాలని కలలు కని, ప్రాణాలకు తెగించి ఉద్యమించి కేసీఆర్ తెలంగాణ సాధించారని అశ్వారావుపేట బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఉద్యమాలు చేయాల్సి వచ్చినా వెనుకడుగు వేయకుండా, ఎందరో అమరుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో నేడు ప్రజావ్యతిరేక...