POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 10:20 pm Posted by : POLITICAL POWER

మాజీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మంత్రివర్యులు గుంట్ల కళ్ళ జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు*

*పొలిటికల్ పవర్ దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ జూలై 18 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*

మాజీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు పోలేపల్లి X రోడ్డులో ఘనంగా నిర్వహించారు
చందంపేట మండలం పోలేపల్లి X రోడ్లో బి.ఆర్.ఎస్ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది శ్రీ జగదీష్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఆయనకు దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిలో జగదీష్ రెడ్డి విశేష కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. ఆయన చొరవతోనే ఉమ్మడి జిల్లాకు రెండు మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయని అన్నారు. జిల్లాలో రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తూ, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పుకొని తిరిగిన నేతలకు ప్రజా తీర్పుతో ఓటమి చవిచూపించిన నాయకుడు జగదీష్ రెడ్డి అని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీకి అంకితభావంతో సేవలందిస్తూ, జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసి ఉమ్మడి నల్గొండ రూపురేఖలను మార్చిన నాయకుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన పట్టుదల, నాయకత్వం వల్లనే జిల్లాలో ప్రతిపక్ష పార్టీల బలమైన కోటలు కూడా బీటలు వారాయని తెలిపారు.
కార్యక్రమంలో జార్పుల లోక్య బోయినపల్లి శ్రీను శంకర్ సత్యనారాయణ అందుగుల సైదులు నోముల శ్రీనయ్య హరిలాల్ కొండల్ రెడ్డి బాలవర్ధిరాజ్ రమేష్ అంజయ్య మున్నా తదితరులు పాల్గొన్నారు