POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 8:34 pm Posted by : POLITICAL POWER

ఫాక్స్ సాగర్ చెరువు FTL వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టులో మెట్టికాయలు


పొలిటికల్ పవర్ సమగర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఎడిటర్ డెస్క్
హైదరాబాద్ – జీడిమెట్లలోని‌ ఫాక్స్ సాగర్ చెరువు FTL వ్యవహారంలో బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి, హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు

దూలపల్లి గ్రామంలోని సర్వే నెంబర్లు 118,119,122లు FTL పరిధిలో ఉన్నాయని 2019, 2023 నాటి జీవోలను రద్దు చేసిన ప్రభుత్వం

FTL నిర్ధారణపై విచారణ పెండింగ్‌లో ఉందని, అది అయ్యే వరకు భూ వినియోగ మార్పు, ఆ ఇండ్లకు ఉండే అన్ని అనుమతులు రద్దు చేయాలని జీవోలో పేర్కొని, దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని హైడ్రాకు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం

దీనికి సవాల్ చేస్తూ, 2013లోని ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారం HMDA వెబ్‌సైట్‌లోని క్యాడస్ట్రల్ మ్యాప్ ప్రకారం సర్వే నెంబర్ 118, 119, 122 FTL కాదు , నేటికీ బఫర్ జోన్ బయట ఉన్నాయని హైకోర్టులో పిటిషన్ వేసిన బాధితులు

రికార్డులను పరిశీలించి పిటిషనర్ల ఆస్తులపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
తదుపరి విచారణ జూలై 27వ తేదీకి వాయిదా