*గాధరి సోమయ్య మరణం ముమ్మాటికీ రాంకి డంపింగ్ యార్డ్ చేసిన హత్య.* *జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చెర్మెన్ షేక్ శావాలి, కమిటీ సభ్యులు అల్లూరి సావిత్రి.*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కీసర సర్కిల్ : జవహర్ నగర్ : జవహర్ నగర్ గత ముప్పై సంవత్సరాల క్రితం గాధరి సోమయ్య పొట్టకూటి కోసం మేడ్చల్ జిల్లా,జవహర్ నగర్, గబ్బిలాల పేట, ఈస్ట్ నందమూరి నగర్ కు వలస వచ్చి స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. జీవనోపాధి కోసం పదిహేను సంవత్సరాలుగా కాంట్రక్ట్ మున్సిపల్ కార్మికునిగా పనిచేసేవాడు. రాంకి కంపెని యజమాన్యం నాలుగు మండలాల చెత్తను సేకరించి జవాహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో డంపు చేయాలని, ఐదు సంవత్సరాల వరకే ఒప్పందాన్ని కుదుర్చుకుంది,...