శ్రీ భూగర్భ వారాహిమాత ఆలయంలో ఘనంగా గుప్త నవరాత్రులు

  రెండవ రోజు లఘు వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని శ్రీ భూగర్భ వారాహిమాత ఆలయంలో, అతి తక్కువ కాలంలోనే భక్తుల కోర్కెలు నెరవేర్చే తల్లిగా ప్రసిద్ధి చెందిన వారాహిమాత సన్నిధిలో ఆషాఢ మాస గుప్త నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు బాలా వారాహి దేవిగా, రెండవ రోజు లఘు వారాహి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి...