అనపర్తి: గురుపౌర్ణమి సందర్భంగా మండలంలోని పీరారామచంద్రపురం శ్రీ షిర్డి సాయిబాబా ఆలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య అభిషేకాలు, అర్చనలు, గురుపూజ, హారతి కార్యక్రమాలు భక్తిపూర్వకంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తమలంపూడి సత్యనారాయణరెడ్డి–అన్నపూర్ణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి బాబావారి ఆశీస్సులు పొందారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయం సుందరంగా అలంకరించబడగా, సాయినామ స్మరణలు, భజనలు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపాయి.
ఈ కార్యక్రమంలో తమలంపూడి కృష్ణారెడ్డి, తమలంపూడి రాజేందర్‌రెడ్డి–పద్మశ్రీ దంపతులు, కోణాల వెంకట సాయిరామరెడ్డి–శేషారత్నం దంపతులు, కోణాల వీర వెంకట సత్యనారాయణరెడ్డి–పద్మ దంపతులు, కర్రీ గోవిందరెడ్డి, నల్లమిల్లి సాయిలక్ష్మి, పడాల హైమావతి, నల్లమిల్లి పుష్పావతి, నల్లమిల్లి జయశ్రీ, నల్లమిల్లి శాంతి, పడాల సాయిలక్ష్మి తదితరులు పాల్గొని బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆలయ గ్రామ పురోహితులు రాము పంతులు వేదోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు సాయిబాబా అనుగ్రహం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.