పీరారామచంద్రపురం సాయిబాబా ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

    అనపర్తి: గురుపౌర్ణమి సందర్భంగా మండలంలోని పీరారామచంద్రపురం శ్రీ షిర్డి సాయిబాబా ఆలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య అభిషేకాలు, అర్చనలు, గురుపూజ, హారతి కార్యక్రమాలు భక్తిపూర్వకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమలంపూడి సత్యనారాయణరెడ్డి–అన్నపూర్ణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి బాబావారి ఆశీస్సులు పొందారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయం సుందరంగా అలంకరించబడగా, సాయినామ స్మరణలు, భజనలు ఆలయ ప్రాంగణాన్ని...