*ఫిర్యాదుల ఫైళ్లు కదలవు… అక్రమాలు ఆగవు!* *మేడ్చల్–మల్కాజిగిరిలో అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నల వర్షం.* *సామాజిక మాధ్యమాల్లో ఆధారాలతో ఫిర్యాదులు…* *కార్యాలయాలకు రాతపూర్వక వినతులు…* *అయినా చర్యలు ఎక్కడ?..*
పొలిటికల్ పవర్ ప్రతినిధి మల్కాజ్గిరి కమిషనరేట్ ఇంచార్జ్ ఏ. పాండు రంగారావు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా: జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఉందా? లేక ఫిర్యాదులు స్వీకరించి ఫైళ్లలో దాచేందుకు ఉందా? అనే ప్రశ్నలు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, అనుమతుల ఉల్లంఘనలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు తదితర అంశాలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నా.. వాటిపై చర్యలు ఎందుకు కనిపించడం లేదన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫిర్యాదు చేసినా ఫలితం లేదా? అక్రమ నిర్మాణాలు...