POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 9:33 pm Posted by : POLITICAL POWER

చినుకు పడితే చాలు కలసపాడు అంతా బురదమయం.

ప్రతిరోజు ఎత్తిపోసుకుంటున్న వర్షపు నీరు… ఎట్టకేలకు పంచాయతీ అధికారులు రంగం లోకి దిగి డ్రైనేజీ కాలువలను పూర్తి చేస్తున్న వైనం…
కలసపాడు ఆగస్టు 13 పొలిటికల్ పవర్ పిన్ 9టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం .ప్రసాద్ రావు .
కలసపాడు. కడప జిల్లా.
బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలో వర్షాకాలం వస్తే స్టేట్ బ్యాంకు వద్ద చిన్నపాటి చెరువు వలె నీరు అంతా అక్కడికి చేరి ఉంటుంది. బ్యాంకు వచ్చేవారికి పాఠశాలకు వెళ్లే వారికి, ఎమ్మార్వో ఆఫీస్, పోలీస్ స్టేషన్ ,ఎంపీడీవో ఆఫీస్, వెళ్లేవారికి చాలా ఇబ్బందికరంగా ఉండడంతో ప్రజలు రకరకాలుగా ప్రభుత్వం గురించి అధికారుల గురించి అనుకుంటున్నారు . ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియడంతో వారు వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి డ్రైనేజీ కాలవంతటిని పునః పరిశీలిస్తున్నారు. గత కాలంలో కొన్ని లక్షల పెట్టి తయారుచేసిన డ్రైనేజీ బూడి పోవడంతో నీరు ఎటువైపు వెళ్లలేక రోడ్డు మీదనే అలలతో అల్లాడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మాజీ ఎంపీటీసీ కడియం. రామ సుబ్బయ్య అధికారుల దృష్టికి తీసుకుపోగా స్పందించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. ఈ డ్రైనేజీ వ్యవస్థ ఎప్పటికి పూర్తవుతుందో వేచి చూడాల్సిందే?