*ఆంధ్రప్రదేశ్ చింతూరు ఎన్ వి ఆర్ న్యూస్ తెలుగు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం వీరన్ *జీవో 3 ప్రత్యామ్నాయ చట్టం, 1/70 పరిరక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలి: ఏఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను*
**ఆదివాసీ ప్రజాప్రతినిధులు నోరు విప్పాలి… లేకుంటే జాతి ద్రోహులే:*
**ఐటీడీఏ ఏపీవో కి ఏఎస్పీ నివేదిక*
చింతూరు:
ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆదివాసుల జీవన ఉపాధి, భూ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ (ఏ ఎస్ పి) ఆధ్వర్యంలో చింతూరు ఐటీడీఏ అదనపు ప్రాజెక్టు అధికారి (ఏపీవో) కి నివేదిక రూపంలో మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ, జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయ చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని, ఏజెన్సీలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
*1/70 చట్టాన్ని కాపాడకపోతే తీవ్ర పరిణామాలు*
ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేయడం సరైంది కాదని ఆయన విమర్శించారు. రాజ్యాంగ నిపుణులతో చర్చించి, ప్రత్యేక చట్టం ఏర్పాటుకు కావాల్సిన అన్ని ప్రధాన అంశాలను ఇప్పటికే ఆదివాసి సంక్షేమ పరిషత్ మరియు ఆదివాసి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం జరిగిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా కాలయాపన చేయడం వల్ల ప్రభుత్వంపై ఆదివాసులకు విశ్వాసం సన్నగిల్లుతోందని, అందుకే ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని కుంజా శ్రీను తెలిపారు.
“*ఆదివాసీల భూ రక్షణ చట్టం ను రక్షించాలి*
ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయకపోవడం వల్ల మైదాన ప్రాంతాల నుంచి నాన్-ట్రైబల్స్ భారీగా వలసలు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి భూముల అమ్మకాలకు, కొనుగోలుకు తమకు కూడా అవకాశం కల్పించాలని, 1/70 చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ నాన్-ట్రైబల్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే మేల్కొనకపోతే ఆదివాసుల అస్తిత్వానికి, మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు.
జీవో 3 ప్రత్యామ్నాయ చట్టం, 1/70 చట్టాల పరిరక్షణకు ఏఎస్పీ పోరు కొనసాగిస్తుందని ఆయన హెచ్చరించారు.
గతంలో జీవో నెంబర్ 3 విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఆదివాసులకు ఎటువంటి చేదు అనుభవాన్ని మిగిల్చిందో, భూ చట్టం విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటే అదే పరిస్థితి పునరావృతమవుతుందని కుంజా శ్రీను ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసుల హక్కుల రక్షణ కోసం ఇప్పటికే ఆదివాసి సంక్షేమ పరిషత్ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ (యాడ్) అయిందని, ప్రభుత్వం కూడా రాష్ట్ర ఆదివాసీల తరఫున ఏజెన్సీని రక్షించడం కోసం సుప్రీంకోర్టులో గట్టి కౌంటర్ దాఖలు చేయాలని మీడియా ద్వారా డిమాండ్ చేశారు.
“*ఆదివాసీ ప్రజాప్రతినిధులు నోరు విప్పాలి… లేకుంటే జాతి ద్రోహులే!*
ఆదివాసుల ఉనికి, సంస్కృతి నిలబడాలంటే భూ రక్షణ చట్టాల అమలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఆదివాసి ప్రజాప్రతినిధులు తమ స్వార్థాన్ని పక్కనపెట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, జీవో 3 ప్రత్యామ్నాయ చట్టం మరియు 1/70 పరిరక్షణకు ప్రభుత్వం ముందడుగు వేసేలా చేయాలని పిలుపునిచ్చారు. లేనిపక్షంలో, చరిత్రలో ప్రభుత్వంలో ఉన్న ఆదివాసి ప్రజాప్రతినిధులు ‘జాతి ద్రోహులుగా’ మిగిలిపోతారని కుంజా శ్రీను తీవ్ర స్వరంతో హెచ్చరించారు. చింతూరు జడ్పిటిసి, చిచ్చడి మురళి, ఆదివాసి జేఏసీ డివిజన్ అధ్యక్షులు జల్లి నరేష్ , బట్ట లక్ష్మణ్ తో కలిసి ఏపీవో కు ఇవ్వడం జరిగింది. నివేదికను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని తెలియజేయడం జరిగింది.
