పొలిటికల్ పవర్ టీవీ9 జాతీయ సమగ్ర దిన పత్రిక రిపోర్టర్ ఏం. ప్రసాదరావు. కలసపాడు కడప జిల్లా. బద్వేల్ మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠం పోలీస్ స్టేషన్ పరిధిలో గుండాపురం గ్రామానికి చెందిన ఓబులేసు మాదిగ, మరియు ముడుమాల గ్రామానికి చెందిన సతీష్ మాదిగలను అగ్రవర్ణాల వారు గత ఐదు నెలల క్రిందట చంపి కాలువలో వేయడం జరిగింది. ఈ విషయం జాతీయ నాయకుడైన మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకెళ్లగా వారు వచ్చి రెండు గ్రామాలను సందర్శించి, గ్రామాలలో ఉన్న సంఘాలతో మాట్లాడి వారికి న్యాయం చేకూర్చాలని అన్నారు. దీనిపైన స్పెషల్ ఏఎస్పీ ని నియమించడం జరిగింది. నేడు ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ మరియు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు ఎం నాగరాజు, ఎస్సీ కమిషన్ డైరెక్టర్లు అనిత, డీఎస్పీ, విజయ్ కుమార్ రాకడ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మరియు జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులతో కలసి చనిపోయిన వారి కుటుంబాలను సందర్శించి వారికి ఊరటను ఇచ్చే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం నందు ఇలాంటి అగత్యాలకు పాల్పడడం చాలా దురదృష్టకరమన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాటడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. ఏది ఏమైనప్పటికీ చనిపోయిన వారి కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని ఏ ఎస్పీ. డి.ఎస్పి .గార్లతో మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ, వీరి మరణానికి కారకులైన ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకొని స్పెషల్ ఇన్విస్టిగేషన్ ప్రారంభించామని వారు తెలిపారు . తప్పక బాధితులకు న్యాయం చేస్తామన్నారు. మరణించిన కుటుంబాల వారికి ప్రభుత్వము నుండి రావలసిన సదుపాయాలను వచ్చేటట్లు చూడాలన్నారు. అలాగే మరణించిన వారి కుటుంబాలకు ఆరు నెలల పాటు కుటుంబ పోషణకు ప్రభుత్వం సహకరించాలన్నారు. అలాగే వారి తల్లిదండ్రులకు నాలుగో క్యాటగిరి కింద జీవనోపాధికి ఏదో ఒక పోస్ట్ ఇప్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వైకే విశ్వనాథ్, మార్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్, జాతి నాయకులు నరేంద్ర మాదిగ, గుండాల ఈశ్వరయ్య, ఎం ఈ ఎఫ్ జాతీయ నాయకులు ఎస్ దేవానందం ఎం ఈ ఎఫ్ జిల్లా అధ్యక్షులు పిచికే బాబు, బద్వేల్ నియోజకవర్గం అధ్యక్షులు వై. ఓబయ్య. ఏపీ జెన్కో ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సాల్మన్, ఉపాధ్యక్షులు ఓ. నరసింహులు. సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ చింతామణి. జిల్లా ఎస్సీ ఈవో వెంకటసుబ్బయ్య, మరియు జిల్లాలోని వివిధ మండలాల ఎమ్మార్పీఎస్, ఎం ఈ ఎఫ్, నాయకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.