ఎల్‌నినో ప్రభావం.. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన

  'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో వ్యవసాయ అధికారుల సూచనలు బిక్కవోలు, జూలై 29: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి జి. వాణి సూచించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం రంగాపురం, ఇళ్లపల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో రైతులకు పంటల బీమా, ఈ-పంట నమోదు, ప్రభుత్వ వ్యవసాయ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జి. వాణి మాట్లాడుతూ, నీటి వసతి...