పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక 9టీవీ తెలుగు న్యూస్ ఏదులాపురం మున్సిపాలిటీ క్రైమ్ రిపోర్టర్ ఎన్ రమేష్ బాబు
భారతదేశంలోని చట్టాలలో ప్రజల కోసం కొన్ని సౌకర్యాలు కొన్ని వెసులుబాట్లు మరియు పక్కవారి కి ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి అసౌకర్యానికి గాని గురి చేయకూడదనేది చట్టంలో స్పష్టంగా రాసింది అలాంటిది కొంతమంది మద్యం ప్రియులు రాత్రి వేళల్లో జనవాసాల మధ్యలో ప్రజలు కుటుంబ సభ్యులు కుటుంబాలతో కాపురాలు ఉండే ప్రదేశాలలో కొంతమంది రౌడీషీటర్లు కొంతమంది ల్యాండ్ మాఫియా గంజాయి బ్యాచి డ్రగ్స్ బ్యాచి అందరూ కలిసి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలంలో ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేటు వెంచర్లలో ఎటువంటి అనుమతులు లేకుండా మద్యం ప్రియులు రాత్రివేళలో బహిరంగంగా మద్యం సేవిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అలాగే కొంతమంది మీద ఈ మద్యం తాగే వ్యక్తులు బహిరంగంగానే భౌతిక దాడులకు పాల్పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి . దీన్ని పర్యవేక్షించాల్సిన పోలీసు వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు దీనికి కారణం ఎవరు ఎందుకు ఇలా జరుగుతోంది ప్రజలను రక్షించవలసిన పోలీస్ యంత్రాంగం ఎలా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది దేవాలయానికి పాఠశాలలకు కళాశాలలకు మినిమం 500 నుంచి 1000 మీటర్ల దూరంలో మాత్రమే మద్యం దుకాణాలు నిర్వహించాలి అనేది చట్టంలో స్పష్టంగా ఉంది కానీ ఇవేవీ పాటించకుండానే వైన్ షాపులు బార్ అండ్ రెస్టారెంట్లు వ్యవహరిస్తున్నాయి మరియు రాత్రి వేళల్లో వైన్ షాపులు బార్ షాపులు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో వైన్ షాపులు 12:00 వరకు బార్ షాపులు ఒంటిగంట వరకు కూడా జరుగుతున్నాయి పోలీస్ వారు ఆప్కారి శాఖ ఎక్సేంజ్ శాఖ వారు కలిసి ఆపరేషన్ చేసి ప్రజలను మందు బాబులం బాధ నుంచి విముక్తి కల్పించాలని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎక్కువగా జనసంచారం ఉండే ఎక్కువగా వ్యాపార సముదాయాలు ఉన్న మూడు రోడ్ల కూడలి అయిన వెంకటగిరి క్రాస్ రోడ్ లో ఇవి నిత్య కృత్యంగా ఉన్నవి ప్రైవేటు వెంచర్ల లో ప్రైవేట్ ఫ్లాట్ల బహిరంగంగా కొంతమంది రౌడీషీటర్లు ల్యాండ్ మాఫియా కి చెందిన ల్యాండ్ రాబరీ సమూహం ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఖమ్మం రూరల్ మండలం పోలీస్ స్టేషన్ మాత్రమే ఉంది ఏదులా పురం మున్సిపాలిటీకి సపరేట్గా ఒక పోలీస్ స్టేషన్ను మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఎందుకంటే ఎదలాపురం మున్సిపాలిటీని రూరల్ మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ఒకటే చూసుకోవాలంటే సిబ్బంది కొరత మరియు సిబ్బంది సమన్వయం లోపించటం వలనే ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు గతంలో పనిచేసిన ఏసీపీలు సిఐలు ఎస్సైలు చాలా పకడ్బందీగా ప్రజలకు అండదండగా చేదోడు వాదోడుగా ఉన్నారు. ఇప్పుడు ఉన్న పోలీస్ యంత్రాంగం పని ఒత్తిడి సపరేట్గా ఏర్పడ్డ మున్సిపాలిటీలోని ప్రజలను పట్టించుకునే పనిలో లేరు ఎందుకంటే వారికి నెలకు అందవలసిన మామూలు మరియు వారికి నెలకు అందవలసినవి అన్నీ అందుతాయి కాబట్టి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో ప్రజలు పోలీసు వారే ఇలా ప్రవర్తిస్తే మేము ఎవరికీ చెప్పుకోవాలి అనే డైలమాలో ఉన్నారు ఇకనైనా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమ్మం ఎదులాపురం మున్సిపాలిటీలో రాత్రి వేళల్లో ప్రైవేటు వెంచర్లలో రియల్ ఎస్టేట్ వెంచర్లలో పోలీసు అధికారులు నిఘా పెట్టి బహిరంగంగా మద్యం సేవించే వారి భరతం పట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు సమస్య వెలికి తీసి ప్రజలకు ప్రభుత్వానికి తెలియజేసే మీడియా ప్రతినిధులను కూడా రాత్రి వేళల్లో బహిరంగంగా మద్యం సేవించే మద్యం ప్రియులు భయపెట్టి భౌతిక దాడులు చేస్తున్న సంఘటనలు ఏదులాపురం మున్సిపాలిటీలో జరుగుతున్నవి ఈ వ్యవహారంలో పోలీసు వారు ఎక్సైజ్ శాఖ వారు సమన్వయంతో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నివసించే సామాన్యుడిగా ప్రభుత్వ అధికారులకు విన్నవించుకుంటున్నాను ఈ విషయంలో ఎవరితోను కూడా ఎటువంటి వైరుధ్యాలు కానీ వైశ్యమ్యాలు కానీ గొడవలు కొట్లాటలకు సమాజంలో పని చేసుకుని భార్య పిల్లలతో గౌరవప్రదంగా బతికి సుఖసంతోషాలతో జీవించాలి అనుకునే ప్రజలకు ఈ చర్యలు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి పలాన వ్యక్తి సిపిఎంపార్టీ పలానా వ్యక్తి సిపిఐ పార్టీ లేదా ఇతను అధికార పార్టీ ఇతను ప్రతిపక్ష పార్టీ అని చెప్పగలిగే యంత్రంగం ఉన్న పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఉన్నారు అనే ధైర్యంతో ప్రజలు ప్రశాంతంగా ఒక నమ్మకంతో జీవిస్తూ ఉంటారు ఉపయోగపడే విషయాన్ని ప్రభుత్వ అధికారులు ప్రజలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటున్న పోలీసు వారికి విన్నవించుకుంటున్నాము ప్రజల మానప్రాణాలను కాపాడవలసిన పోలీస్ యంత్రాంగం రాత్రి పూట గస్తీ కాయవలసిన గస్తీ బృందాలు ఎక్కడ ఉన్నాయి? ఏం చేస్తున్నాయి అనేది ఏదు లాపురం మున్సిపాలిటీ పరిధిలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది ఇకనైనా పోలీసు యంత్రాంగం ఎక్స్చేంజి శాఖ సమన్వయంతో రాత్రిపూట బార్ అండ్ రెస్టారెంట్లు మరియు వైన్ షాపులను టైం కు మూయించాలి అలాగే బడికి గుడికి పాఠశాలకు కళాశాలలకు ఇన్ని మీటర్ల దూరంలో ఉండాలని చట్టాలలో చెబుతున్నట్టుగా ఆ విషయాన్ని ఆచరించాలి ఇది ఎవరిని ఉద్దేశించి రాసిన వార్త కాదు సమాజంలో ఉన్న జరుగుతున్న సమాజంలో ఉన్న ప్రజలకు ప్రయబాంతుల గురిచేసే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను అరెస్టు చేయటమే కాదు అవసరమైతే పిడిఎఫ్ పెట్టి వాళ్ళని శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. ఇలాంటి వారి వల్ల సమాజం లొ విషయాలను తమ పనులు తమ చేసుకొని జీవించే ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి కొసమెరుపు ఏంటంటే పంట భూములను వెంచర్లుగా మార్చి అమాయక ప్రజలకు అమ్ముకొని వారికి అందించవలసిన సౌకర్యాలైన వెంచర్ చుట్టూ ఫెన్సింగ్ గాని వెంచర్ చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ కంచ వేయటం గాని లేదా ఆ వెంచర్ కు ఇన్ అవుట్ గేట్లు పెట్టడం గాని ఆ వెంచర్లలో సెక్యూరిటీని పెట్టడం గాని ఏదులాపురం మున్సిపాలిటీలో వెంచర్లు వేసే వ్యక్తులు ఈ సౌకర్యాలు అన్ని ప్రజల కల్పించుకుంటానే అమాయక ప్రజలకు ఫ్లాట్ల అమ్ముతున్నారు వారిపైన కూడా రిజిస్ట్రేషన్ శాఖ రెవెన్యూ శాఖ దృష్టి సారించాలి పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆ వెంచర్లో అన్ని సౌకర్యాలు ప్రజలకు వెంచర్ వేసే వ్యక్తులు కల్పిస్తున్నారా లేదా అని చూసిన తర్వాతనే వెంచర్ల లో ఫ్లాట్ల అమ్ముకోవడానికి యాజమాన్యానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలి దీని మీద దృష్టి పెట్టాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు
