కొమరం భీమ్ ఆశయాల స్ఫూర్తితో ఆదివాసి హక్కులు, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం – మంత్రి సీతక్క
భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి ఆదివాసీ యువత విద్య, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అశ్వారావుపేటలో కొమరం భీమ్ విగ్రహావిష్కరణ అశ్వారావుపేట,ఆగస్టు 9: ప్రపంచివాసీనోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో కొమరం భీమ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దానసరి అనసూయ (సీతక్క) హాజరయ్యారు. జిల్లాకు విచ్చేసిన మంత్రి సీతక్కకు ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు, కొమ్ము...