స్టేట్ బ్యూరో : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు
భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ శాఖ చేసిన నిరంతర పోరాటం ఫలితంగానే పరకాల 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం జరుగుతోంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన ఈ ఆసుపత్రిని ప్రారంభించకుండా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కాలయాపన చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సమస్యలపై బీజేపీ పరకాల పట్టణ శాఖ అనేక దశల్లో పోరాటాలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహించింది. బీజేపీ పోరాటాలకు తలొగ్గిన ప్రభుత్వం ఎట్టకేలకు నేడు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇది బీజేపీ పరకాల పట్టణ శాఖ పోరాట ఫలితమే!. అయితే కేవలం ప్రారంభోత్సవం చేసి చేతులు దులుపుకోకుండా, పూర్తిస్థాయి వైద్య సేవలు వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ పరకాల పట్టణ శాఖ డిమాండ్ చేస్తోంది. 👉 24 గంటల వైద్య సేవలు. 👉 అవసరమైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నియామకం. 👉 అన్ని విభాగాల్లో వైద్య సేవలు. 👉 అవసరమైన మందులు, వైద్య పరికరాల అందుబాటు. ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు. ప్రారంభోత్సవం మాత్రమే కాదు – పూర్తి వైద్య సేవలతో ఆసుపత్రిని ప్రారంభించాలి!
భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ శాఖ, గాజుల నిరంజన్ బిజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు