పొలిటికల్ పవర్ న్యూస్ : జహీరాబాద్ మండల పరిధిలోని బూర్దిపాడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎంజీ. రాములు హాజరయ్యారు. గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇండ్లు, పెన్షన్లు తదితర ప్రభుత్వ పథకాలు అర్హులైన
ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీ
సర్పంచ్ మల్లీకార్జున్ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉపసర్పంచ్ తుక్కమ్మ, బీ.శోభారాణి, తుకారాం, ఆర్.రేక , జే.నర్సింహులు, కే.భవానీ, బీ.ప్రశాంత కుమార్ గ్రామస్థులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామంలో జెండా ఆవిష్కరణ జరగడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.