*డాక్టర్స్ డే సందర్భంగా నారాయణ విద్యాసంస్థలో వినూత్నంగా వేడుకలు*
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి జూలై 10: డాక్టర్స్ డే సందర్భంగా అనపర్తిలోని నారాయణ విద్యాసంస్థలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైద్య వృత్తి గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేసే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు డాక్టర్ల వేషధారణలో పాల్గొని తమ అభినయంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నందకుమార్ మాట్లాడుతూ, మానవాళి ఆరోగ్యాన్ని కాపాడేందుకు అహర్నిశలు శ్రమించే వైద్యులు సమాజానికి అమూల్యమైన సేవలు అందిస్తున్నారని అన్నారు. ప్రాణాలను నిలబెట్టే వైద్యులను గౌరవించడం ప్రతి...