*పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక సిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ జూలై 16 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*
దేవరకొండ మున్సిపాలిటీ 7వ వార్డు
దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో జల్ శక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా “జల్ సంవిధాన్” ప్రధాన భావనతో 7వ వార్డులో ప్రజలకు జల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
సందర్భంగా “జల్ సంవిధాన్” ద్వారా ప్రతి పౌరుడు నీటిని సంరక్షించడం తన సామాజిక బాధ్యతగా భావించి, వర్షపు నీటి సంరక్ భూగర్భ జలాల పరిరక్షణ, నీటి వృథా నివారణ మరియు ప్రతి ఇంటిలో వర్షపు నీటి నిల్వ వ్యవస్థలను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యమే సుస్థిర భవిష్యత్తుకు పునాది అని అధికారులు వివరించారు.
అవగాహన కార్యక్రమంలో 7వ వార్డు గౌరవ కౌన్సిలర్ సాయి చంద్ర టి పి బి ఓ శ్రీమతి వర్షిత ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీ రమావత్ సకృ నాయక్ మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.
సందర్భంగా అధికారులు “జల్ సంవిధాన్ – ప్రతి ఇంటి బాధ్యత, ప్రతి పౌరుడి కర్తవ్యం” అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరూ కార్యక్రమం
