నిరుద్యోగులకు న్యాయం చేయాలి.. బిక్కవోలులో వైఎస్సార్‌సీపీ రీలే నిరాహార దీక్ష
బిక్కవోలు: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ–2025 నిర్వహణలో జరిగిన అక్రమాలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బిక్కవోలు మండలంలోని బిక్కవోలు గ్రామంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష చేపట్టారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని దీక్షలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన,...