రుద్రూర్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు…
పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం…
రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రుద్రూర్ మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి, కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు.
బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు, రుద్రూర్ మండల నికి చెందిన అంబం ఆర్ గ్రామంలో ఇందూర్ గౌరయ్య కు చెందిన కుమారుడు ఆకలామారణం చెందడంతో ఆయనకు ఆర్థిక సహాయంగా రవికిరణ్ చేతుల మీదుగా 5000 రూపాయలు అందజేయడం జరిగిందని అన్నారు.
అనంతరం అంబం గ్రామంలోని అంగన్వాడి, స్కూల్ మరియు బొప్పాపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో ఉన్న విద్యార్థులకు బాల, బాలికలకు స్వీట్లు మరియు బిస్కెట్ ప్యాకెట్లు మరియు పలకలు, బుక్కులు, పెన్నులు,పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని రుద్రూర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో రుద్రూర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు, కొత్తపల్లి రవికిరణ్, సాయిలు, సిరిగాది శేఖర్, శ్రావణ్, శేఖర్, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.