ఆచార్య బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఘనంగా నిర్వహించిన ఔషధ మొక్కల దినోత్సవం…
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 4 ఆగస్టు 2026. రుద్రూర్ మండల కేంద్రంలోని పతంజలి యోగ మరియు ధ్యాన కేంద్రం నందు మంగళవారం ఆధునిక ఆయుర్వేద శిరోమణి ఆచార్య బాలకృష్ణ 55వ జన్మదినం సందర్భంగా ఔషధ మొక్కల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహర్షి పతంజలి యజ్ఞ సహిత యోగ మరియు ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 4 వ తేదీన ఔషధ మొక్కల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో భాగంగా...