న్యూ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో నిర్వహణ
వివిధ వ్యాధులకు పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ
పొలిటికల్ పవర్ దినపత్రిక / పి యన్ 9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని గంగారం గ్రామ అభివృద్ధి ప్రదాత దాసరి మధుమోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ రోజు అనగా శుక్రవారం నాడు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
జలగం నగర్ చెరువు సమీపంలో నిర్వహించే ఈ వైద్య శిబిరాన్ని న్యూ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసి ,శిబిరంలో చిన్నపిల్లల వైద్యులు, ఎండీ వైద్యులు, చెవి-ముక్కు-గొంతు (ఈఎన్‌టీ) నిపుణులు, పెద్దల వైద్యులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు.
గంగారం గ్రామంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరంలో మొత్తం 101 మంది ,, వైద్యం , చేయించుకొని , వివిధ వ్యాధులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు జేశారు. ఈ కార్యక్రమంలో గంగారం గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్లు , వార్డ్ మెంబర్స్ , న్యూ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ లహరి భీమిశెట్టి , డాక్టర్ ముదిశెట్టి ఉమేష్ , స్టాప్ నెంబర్స్ భాగ్యశ్రీ , శ్రావణి ,నందిని , గోపి ,సురేష్ మొదలగువారు. కాంగ్రెస్ నూతన కమిటీ సభ్యులు చల్లారి సత్యనారాయణ గౌడ్ ,మధుమోహన్ రెడ్డి యొక్క అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
