POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 1:33 pm Posted by : POLITICAL POWER

​బెదిరింపులతో ఉద్యమాలు ఆపలేరు: కామనురు శ్రీనివాసులురెడ్డి..

 


పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్
​ఏపీజెన్‌కో ఆర్టీపీపీ యాజమాన్యం జారీ చేసిన చట్టవిరుద్ధ సర్క్యులర్ మెమో 507/26ను వెంటనే ఉపసంహరించుకోవాలి:
సిఐటియూ డిమాండ్

​కడప:
కడప నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలోయునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (యు.ఈ.ఈ.యు – బి-1829) డిమాండ్ చేశాయి. కడప నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షులు కామనురు శ్రీనివాసులురెడ్డి నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని డాక్టర్ ఎం.వి.ఆర్. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ) యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల రాజ్యాంగ, కార్మిక హక్కులను కాలరాస్తూ జారీ చేసిన సర్క్యులర్ మెమో నెం. 507/26 (తేదీ: 08-08-2026)ను వెంటనే ఉపసంహరించుకోవాలని సి మరియు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (యు.ఈ.ఈ.యు – బి-1829) డిమాండ్ చేశారు.
​ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 10న జరగనున్న నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఆర్టీపీపీ యాజమాన్యం కుట్ర పన్నుతోందని ఆయన విమర్శించారు. కార్మికులను పరిశ్రమ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లనివ్వకుండా బంధించడం, సెలవులు నిరాకరించడం, ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరింపులకు గురిచేయడం అత్యంత అప్రజాస్వామికమని మండిపడ్డారు.
​​రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ప్రకారం కార్మికులకు ఉన్న ప్రశాంత నిరసన హక్కును కాలరాయడం పూర్తిగా చట్టవిరుద్ధం.
​బలవంతపు చాకిరీ శిక్షార్హమైన నేరం: కార్మికుల ఇష్టానికి విరుద్ధంగా బలవంతంగా పని చేయించడం వెట్టి చాకిరీ (రద్దు) చట్టం, 1976 ప్రకారం శిక్షార్హమైన నేరం.
​చట్టపరమైన చర్యలు: ఆర్టీపీపీ యాజమాన్యం ఈ అక్రమ సర్క్యులర్‌ను తక్షణమే వెనక్కి తీసుకోకపోతే కడప జిల్లా లేబర్ కమిషనర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేస్తాం.
​యాజమాన్యం ఎన్ని ఆంక్షలు విధించినా, బెదిరింపులకు దిగినా కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ పోరాటంలో భాగంగా ఆగస్టు 10న తలపెట్టిన “చలో విజయవాడ” కార్యక్రమం జరిగి తీరుతుందని శ్రీనివాసులురెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.