*ఆధ్యాత్మిక వైభవానికి నూతన అధ్యాయం… బలభద్రపురంలో కృష్ణ–సంతోషిమాత–అయ్యప్ప దేవస్థానం సిద్ధం*

    - దివ్యశోభతో అలరారుతున్న ఆలయం... భక్తులకు మరో మహా పుణ్యక్షేత్రం బిక్కవోలు, జులై 09 (పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక – అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి): తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం నేడు ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా, భక్తి పరిమళాలు వెదజల్లే పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. ఇప్పటికే ఆంధ్ర షిర్డీ సాయినాథుని ఆలయం, తూర్పు తిరుమలగా ప్రసిద్ధి చెందిన ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం, భూగర్భ వారాహి అమ్మవారి ఆలయం వంటి దివ్య దేవాలయాలతో ప్రత్యేక...