మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
అనపర్తి, ఆగస్టు 6: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ–2025 నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనల్లో భాగంగా అనపర్తిలో గురువారం రీలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నిర్వహించినది మెగా డీఎస్సీ కాదని, నిరుద్యోగులను మోసం చేసిన "దగా డీఎస్సీ" అని విమర్శించారు. ప్రభుత్వానికి అనుకూలమైన వారికి ఉద్యోగాలు కల్పించేలా నిబంధనలు, జీవోలను సైతం మార్చారని ఆయన ఆరోపించారు. గతంలో వైయస్ జగన్...