నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్.
10 జూలై 2026.
లయన్స్ క్లబ్ రుద్రూర్ మరియు ధాత్రి శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రుద్రూర్ లోని శశిరేఖ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రుద్రూర్ ఎస్సై మనోజ్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదాతల ద్వారా 28 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై మనోజ్ కుమార్ మాట్లాడుతూ రక్తాన్ని దానం చేయడం ఒక మహత్తరమైన సేవ అని, ఒక యూనిట్ రక్తం ద్వారా ఇద్దరి ప్రాణాలను కాపాడవచ్చునని, కావున ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన లయన్స్ క్లబ్ రుద్రూర్ మరియు ధాత్రి శ్రీ ఫౌండేషన్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో సేవ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, అలాగే రక్తదాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు గుండూరు ప్రశాంత్ గౌడ్, ధాత్రి శ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గాండ్ల మధు, లయన్స్ క్లబ్ కార్యదర్శి లయన్ గెంటిల గంగాధర్, కోశాధికారి లయన్ పార్వతి ప్రశాంత్, జిల్లా అధ్యక్షులు లయన్ కెవి మోహన్, రాష్ట్ర జిఎస్టి కోఆర్డినేటర్ లయన్ శ్యాంసుందర్ పహాడే, సీనియర్ సభ్యులు లోగం నాగరాజు, శివ సాయి ప్రసాద్, డైరెక్టర్స్ పుట్టి సాగర్, పుట్టి సందీప్, ఒరికె సతీష్, నాన్ లయన్ సభ్యులు సాయికుమార్, దుర్కి సునీల్, గాండ్ల శ్రావణ్, వినయ్ మరియు రెడ్ క్రాస్ సభ్యులు గంగాధర్, ఇతర సిబ్బంది, రక్తదాతలు, తదితరులు పాల్గొన్నారు.