భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కేంద్రంగా గోండ్వానా న్యాయ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 17 నుంచి పాదయాత్ర ప్రారంభించునున్నట్టు ఆదివాసి ఉభయ రాష్ట్రాల కన్వీనర్ సోందే వీరయ్య తెలిపారు. సోమవారం నాడు సుందరయ్య నగర్ కాలనీలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయo సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సోందే వీరయ్య మాట్లాడుతూ ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతాలలో ఒక న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూ ఉద్యమమ్ కొనసాగిస్తున్నామని. ఈ ప్రాంతం లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థులు లా కోర్సు చదువుకోడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు.. ప్రైవేటు కాలేజీలు ఉన్నప్పటికీ పేద విద్యార్థులు లక్షలు పెట్టి చదువుకునే స్తోమత లేదని కావున ప్రభుత్వం ఈ ప్రాంత వాసులకు. మరియు బీడీ కాలేజీ తరహాలో షెడ్యూల్ ప్రాంత నిరుద్యోగ విద్యార్థులకు మరియు ప్రస్తుతము చదువుతున్న విద్యార్థులకు గోండ్వానా లా కాలేజ్ ఏర్పాటు చేస్తే ఎంతగానో ఉపయోగపడుతుందని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని తద్వారా నిరుద్యోగ సమస్య జటిలంగా ఉన్నందున గోండ్వానా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. దీనిలో భాగంగానే ఈనెల 17న చర్ల మండలం సుబ్బంపేట పంచాయతీ ఎదిర గుట్టల సమ్మక్క సారలమ్మ సన్నిధి నుండి పాదయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు.. ఈ యొక్క పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు మేధావులు ఉద్యోగస్తులు ప్రజాసంఘాలు , విద్యార్థులు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో పాయం సన్యాసి,ముక్తి జనార్దన్ రావు పాల్గొన్నారు..