POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 9:54 am Posted by : POLITICAL POWER

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ కేంద్రం తిప్పిపంపడం దుర్మార్గం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బి చంద్రశేఖర్
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం

తెలంగాణ నీటి హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రా అధికారుల చేతిలో పెట్టింది

గురువు చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి పాలమూరు భవిష్యత్తును తాకట్టు పెడుతున్నాడు

పోలవరం, బనకచర్లకు లేని అభ్యంతరాలు పాలమూరు రంగారెడ్డికి ఎందుకు ?

ఆంధ్రా ప్రయోజనాల కోసం బీజేపీ తెలంగాణను బలిపెడుతుంది

ఎనిమిది మంది బీజేపీ, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు చేతులు ముడుచుకొని కూర్చున్నారు

ఒక్కరు కూడా తెలంగాణ ప్రాజెక్టుల కోసం పార్లమెంటులో గళమెత్తడం లేదు

కర్ణాటక ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన కేంద్రం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎందుకు జాతీయహోదా ఇవ్వడం లేదు ?

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కాంగ్రెస్, బీజేపీది కపట నాటకం

బీఆర్ఎస్ హయాంలోనే హైడ్రాలజీ మినహా అన్ని అనుమతులు సాధించడం జరిగింది

చివరి నిమిషంలో డీపీఆర్ వెనక్కి పంపడం సరికాదు

ఇటీవల సుప్రీంకోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్ కూడా పాలమూరు రంగారెడ్డికి వచ్చినట్లే

ఇక మిగిలింది నీటి కేటాయింపులతో కూడుకున్న హైడ్రాలజీ అంశం మాత్రమే

హైడ్రాలజీ అంశం కూడా కృష్ణా వాటర్ డిస్పూటరీ ట్రిబ్యునల్ లో ఉంది

తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందే తనకున్న కేటాయింపుల నుండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలు కేటాయించుకున్నది

కాబట్టి కేంద్రం వెంటనే డీపీఆర్ ఆమోదించాలి

రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ఆమోదం కోసం ఢిల్లీకి అఖిలపక్షంతో కూడిన ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని పంపాలి

పాలమూరు రైతాంగానికి అన్యాయం జరిగితే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శాశ్వత ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారు

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ కేంద్రం వెనక్కి పంపిన నేపథ్యంలో ఒక ప్రకటనలో స్పందించిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి