తోస్సిపూడి గ్రామంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం
బిక్కవోలు: ఎస్పీ ఆదేశాల మేరకు తూర్పుగోదావరిజిల్లా బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో ఎస్ఐ రవిచంద్రకుమార్ ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది గ్రామంలో పర్యటిస్తూ గ్రామస్థులతో నేరుగా మమేకమయ్యారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు గ్రామంలో శాంతిభద్రతల పరిస్థితి, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలపై వివరాలు సేకరించారు. గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనే విషయాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను...