ప్రమాదకరంగా మారిన పందలపాక వంతెన

  పందలపాక గ్రామం వంతెనపై ప్రమాదకర పరిస్థితి రైలింగ్ ఏర్పాటు చేయాలని పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఆర్&బీ అధికారులు – కాలువలోకి దాదాపు పడిపోయిన లారీ బిక్కవోలు: మండలంలోని పందలపాక గ్రామంలో మసీదు సమీపంలో ఉన్న వంతెన ప్రమాదాలకు నిలయంగా మారింది. వంతెనకు ఇరువైపులా రక్షణ రైలింగ్ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో, వర్షాకాలంలో ఈ వంతెనపై ప్రయాణించడం మరింత ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పందలపాక,ఊలపల్లి మీదుగా  మామిడాడ గ్రామానికి వేళ్ళే వాహనాలు,...