బహుజనుల ఆత్మ గౌరవానికి ప్రతీక పాపన్న గౌడ్ -ఎమ్మెల్యే జారె

పొలిటికల్ పవర్, ఆగస్టు 18 దమ్మపేట: బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ.. నాటి మొఘల్ సుల్తాన్లు, స్థానిక భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి, ఖిలాషాపూర్‌లో రాతి కోటను నిర్మించి స్వయంపాలనను సాధించిన గొప్ప విప్లవ...