ఎల్‌నినో పరిస్థితుల్లో వరి రైతులు అప్రమత్తంగా ఉండాలి

  పొలం పిలుస్తోంది కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు బిక్కవోలు, ఆగస్టు 4: బిక్కవోలు మండలంలోని ఊలపల్లి, బిక్కవోలు గ్రామాల్లో మంగళవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి (ఏఓ) జి. వాణి, ఏఈఓలు శ్రీనివాసు, భాస్కరరెడ్డి, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఓ జి. వాణి మాట్లాడుతూ ఈ-క్రాపింగ్, పంటల బీమా ప్రాధాన్యతపై రైతులకు అవగాహన కల్పించారు. పంటల బీమా నమోదు చేసుకోవడానికి ఈ నెల 15వ తేదీ చివరి గడువని,...