POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 11:50 am Posted by : POLITICAL POWER

మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలి: ఎమ్ఏల్ఏ బండారి లక్ష్మా రెడ్డి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు

ఉప్పల్ నియోజకవర్గం : చర్లపల్లి డివిజన్‌లో ఇప్పటికే మంజూరైన అభివృద్ధి పనులు ప్రారంభం కాకుండా పెండింగ్‌లో ఉండటంపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు మల్కాజ్గిరి మున్సిపల్  కమీషనర్ వినయ్ కృష్ణ రెడ్డి IAS ని కలిసి మంజూరైన పనుల వివరాలను ఎమ్మెల్యే చర్చించారు. నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మంజూరైన పనులను ఇకపై ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. అదేవిధంగా డివిజన్‌లో ప్రజల అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన నూతన అభివృద్ధి పనులకు కూడా అవసరమైన నిధులు కేటాయించాలని జోనల్ కమిషనర్‌ను కోరారు. డివిజన్‌లో రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని బండారి లక్ష్మారెడ్డి సూచించారు. BRS పార్టీ నాయకులు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.