సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసిత రైతులు సంతోషపడేలా ఆర్థిక సహాయం అందేలా చేస్తా: ఎమ్మెల్యే జారె
పొలిటికల్ పవర్, ఆగస్టు 20,దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పట్వారి గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో సీతారామ ప్రాజెక్టు పంట కాలువల నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులు తమ సమస్యలను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దృష్టికి తీసుకువచ్చారు. సీతారామ ప్రాజెక్టు పంట కాలువల నిర్మాణం వల్ల తమ సాగుభూములు కోల్పోతున్న రైతులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. తమ భూములను ప్రాజెక్టు కోసం తీసుకోవడం వల్ల భవిష్యత్‌లో తమ జీవనోపాధిపై ప్రభావం...