POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 8:45 pm Posted by : POLITICAL POWER

*సామాజికసేవే మా “వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ” లక్ష్యం.* -అధ్యక్షుడు సూర్యప్రకాశ్ రావు, వైస్ గవర్నర్ నూకల మురళీకృష్ణ.

*వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సేవలు ఎంతో విలువైనవి.*
-ఏఐఎఫ్ఇటిఓ జాతీయకార్యదర్శి పి.రమణారెడ్డి … కలసపాడు జూలై 11 పొలిటికల్ పవర్ పిన్9టీవీ సమగ్ర జాతీయ దినపత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాదరావు. కలసపాడు. కడప జిల్లా.
సమాజానికి తమ వంతు సేవ చేసి అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షుడు శిద్ధా. సూర్య ప్రకాష్ రావు, వైస్ .గవర్నర్ నూకల మురళీకృష్ణ తెలిపారు.
శనివారం ఉదయం కలసపాడులోని బాలుర ఉన్నత పాఠశాల యందు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ చేశారు,ప్రతి తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రధమ,ద్వితీయ,తృతీయ స్థానాలలోని విద్యార్థులను అభినందించడం, పదవతరగతి విద్యార్థులకు, గణితబాక్స్ లను అందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్య ప్రకాష్ రావు, మురళీకృష్ణ మాట్లాడుతూ మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇతర దేశాలలో సైతం సంవత్సరానికి 60 కోట్ల రూపాయలతో విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ,పాఠశాలలకు ఫర్నిచర్ తదితర సామాగ్రి అందజేయడం, రక్తదానం,మొక్కలు పెంచడం,అనాధ ఆశ్రమాలకు,వృద్ధాశ్రమాలకు, ఆసుపత్రులకు సహాయం చేయడంలాంటి ఎన్నో కార్యక్రమాలను తమ సంస్థ తరఫున చేపడుతున్నామన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్స్ ఆర్గనైజేషన్(ఏఐఎఫ్ఇటిఓ) జాతీయ కార్యదర్శి పి.రమణారెడ్డి మాట్లాడుతూ, కలసపాడు ప్రాంత వాస్తవ్యుడిగా,హైస్కూల్ పూర్వ విద్యార్థిగా మురళీకృష్ణ తమ సంస్థ అధ్యక్షుడు సూర్యప్రకాష్ రావుతో కలిసి,ఈ ప్రాంతంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు.వృత్తిరీత్యా విదేశాలలో ఉన్నప్పటికీ తను పుట్టి పెరిగిన ప్రాంతానికి తమ వంతు సేవ,సహకారం అందించాలనే సదుద్దేశంతో సమాజసేవ చేస్తున్న వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకుని సమాజసేవ చేయడానికి ముందుకు రావాలన్నారు. అప్పుడే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందన్నారు.
ఈ సందర్భంగా బాయ్స్ హైస్కూల్లో చదువుతున్న బాలికలకు త్వరలోనే సైకిళ్లు అందిస్తామని, ఇంకా ఈ ప్రాంతంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను సంస్థ ఆధ్వర్యంలో చేపడతామని మురళీకృష్ణ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు ఎం.వి.రమణ, ఉపాధ్యాయినులు కృష్ణవేణి,సలోమి సత్యవతి,ఎస్టీయు నాయకులు యు.సుబ్రహ్మణ్యం,ఎస్.వి. సత్యనారాయణ,జి.రమణారెడ్డి నటరాజ,ఆర్యవైశ్య ప్రముఖులు కామిశెట్టి సుదర్శన్,జక్కా సుధాకర్,బి.సత్యనారాయణ, చాటకొండు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.