శ్రీ భూగర్భ వారాహిమాత ఆలయంలో గుప్త నవరాత్రుల ఎనిమిదవ రోజు సింహా రూఢా అవతారంలో శ్రీ వారాహిమాత

  శ్రీ భూగర్భ వారాహిమాత ఆలయంలో గుప్త నవరాత్రుల సందర్భంగా ఎనిమిదవ రోజు అమ్మవారు సింహ రూఢా విజయ వారాహి అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అతి తక్కువ కాలంలోనే విశేష ఖ్యాతి పొందిన ఈ ఆలయానికి రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. గుప్త నవరాత్రుల సందర్భంగా ఆలయ కమిటీ ప్రతిరోజూ అమ్మవారిని ఒక్కో ప్రత్యేక నవరాత్రి అలంకరణలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తోంది. ఈ సందర్భంగా ప్రతిరోజూ కుంకుమ పూజలు, అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు భక్తి...