16.07.2026 – గురువారం పొలిటికల్ పవర్ సమగ్ర
జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్ 9టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి కే వెంకటేష్
ఉమ్మడి జిల్లా పరిధిలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు,పనుల పురోగతిని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు *శ్రీ మల్లు భట్టి విక్రమార్క *, సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు *శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి *, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు *శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి * తో కలిసి స్థానిక శాసనసభ్యులు శ్రీ *జారె ఆదినారాయణ * ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పనులపై అధికారులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… గోదావరి జలాలను గ్రావిటీ మరియు లిఫ్ట్ విధానాల ద్వారా గరిష్టంగా వినియోగంలోకి తీసుకువచ్చి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీతారామ ప్రాజెక్టును సమగ్రంగా సమీక్షించి, ఇప్పటికే జరిగిన పనులు వృథా కాకుండా అవసరమైన సాంకేతిక మార్పులతో వేగంగా పూర్తి చేసే దిశగా నిరంతర కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ప్రజల పన్నుల రూపంలో వచ్చే ప్రతి పైసా ప్రజా ధనాన్ని జాగ్రత్తగా వినియోగిస్తూ, ప్రాధాన్యతా క్రమంలో ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
డిస్ట్రిబ్యూటరీ కాలువలు, లింక్ కెనాల్స్, టన్నెల్స్ నిర్మాణంతో వైరా, పాలేరు రిజర్వాయర్లను అనుసంధానిస్తూ సత్తుపల్లి వరకు సాగునీరు అందేలా పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు నెలవారీ కార్యాచరణ ప్రణాళికతో నిరంతర సమీక్షలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సహచర ఎమ్మెల్యేలు
స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు…..