గిరిజన సాగు భూముల హక్కుల కోసం నిరవధిక సమ్మెకు తాటి వెంకటేశ్వర్లు మద్దతు
పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆగస్టు 15: గిరిజన సాగు భూములకు పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మద్దతు తెలిపారు. సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తరతరాలుగా సాగు చేసుకుంటున్న రెవెన్యూ భూములకు పట్టా హక్కు పత్రాలు, పట్టా పాస్ పుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు. సర్వే నంబర్లు 33, 37, 38, 122లోని భూములపై పలుమార్లు జాయింట్ సర్వే నిర్వహించినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదని రైతులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.
అనాదిగా సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పట్టాలు రాకుండా ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ శాఖకు తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అనేకసార్లు కలిసి విజ్ఞప్తి చేశానని, దాని ఫలితంగా కొంతమంది గిరిజన రైతులకు పట్టా పాస్ పుస్తకాలు మంజూరయ్యాయని గుర్తుచేశారు.
ముందస్తు ఎన్నికల కారణంగా తన పదవీకాలం ఆరు నెలల ముందే ముగిసిందని, అనంతరం వచ్చిన ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కూడా కొంతమేర పట్టా పాస్ పుస్తకాలు అందజేశారని తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. “మీ భూములకు హక్కు పత్రాలు అందే వరకు మీ తరఫున పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని రైతులకు హామీ ఇచ్చారు.
వేదాంతపురం పరిధిలో సుమారు 426 ఎకరాల భూమిని సాగు చేస్తున్న 150 మంది రైతులకు తక్షణమే పట్టా హక్కు పత్రాలు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గిరిజన రైతుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, అర్హులైన ప్రతి రైతుకు భూ హక్కులు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయుకులు
కాసాని చంద్రమోహన్, మాజీ జడ్పిటిసి అంకత మల్లికార్జున రావు, గొడవర్తి వెంకటేశ్వర్లు, మండల పట్టణ మాజీ అధ్యక్షులు సత్య వరపు సంపూర్ణ, డాక్టర్ భూక్యా ప్రసాద్, జక్కుల రాంబాబు,మోటూరి మోహన్, ఎస్.కె ఆసిఫ్, ఎస్.కె రఫీ,శెట్టిపల్లి రఘురాం, ఆరెపల్లి గోవింద్, బొర్రా వెంకన్న, పండు గణేష్, ఆరెపల్లి రాంబాబు, తగరం జగన్నాథం,పాలవలస జీవన్ రావు, జై అప్పారావు, కూనసోత్ నవీన్ నాయుక్, సాధు జోస్నాబాయి, రహీమ్ మునిషా,బుక్కురి బుచ్చి బాబు,నార్లపాటి బాబురావు,గంధం ఆనంద్, నార్లపాటి చిన్న అబ్బాయి, బాలి కిరణ్, సోమాని రాజా రమేష్, గాడిచర్ల శివ, రాయుల భారత్, విష్ణు, గంగాధర్, తగరం హరి, రాంబాబు,బజరయ్య, బోడపాటి ప్రసాదు, అఖిల్, ఆకాష్,బలరాం ( టైలర్ )మూతయ్య, నాగరాజు, హాసిన్, గాంధీ,ప్రవీణ్, ఆదినారాయణ,లక్షణ్, రాఘవ మరియు యూత్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు