గిరిజన రైతుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి -మాజీ ఎమ్మెల్యే తాటి

గిరిజన సాగు భూముల హక్కుల కోసం నిరవధిక సమ్మెకు తాటి వెంకటేశ్వర్లు మద్దతు పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆగస్టు 15: గిరిజన సాగు భూములకు పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మద్దతు తెలిపారు. సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తరతరాలుగా సాగు చేసుకుంటున్న రెవెన్యూ భూములకు పట్టా హక్కు పత్రాలు,...