POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 1:12 pm Posted by : POLITICAL POWER

మొఘల్ సామ్రాజ్యాన్ని ధిక్కరించి, దక్కన్‌లోని సామంత వ్యవస్థను సవాలు విసిరిన సర్వాయి పాపన్న కు నివాళులు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.

మొఘల్ సామ్రాజ్యాన్ని ధిక్కరించి, దక్కన్‌లోని సామంత వ్యవస్థను సవాల చేస్తూ ప్రజల కోసం వీరోచితంగా పోరాడిన మహోన్నత యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నాంపల్లిలో ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించాము. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు, మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, లోక్‌సభ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి శ్రీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ శ్రీ మల్క కొమురయ్య తదితర నాయకులు పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  సేవలను, ధైర్యసాహసాలను స్మరించుకొని నివాళులు అర్పించారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వీరత్వం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఎల్లప్పుడూ ఆదర్శప్రాయం.