ఆదివాసీ నాయకులపై కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ వ్యాఖ్యలను ఖండించిన తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు దారబోయిన రమేష్

పొలిటికల్ పవర్, జూలై 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఇటీవల ఆదివాసీ నాయకులపై చేసిన వ్యాఖ్యలను తుడుందెబ్బ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు దారబోయిన రమేష్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తూ, రాజ్యాంగం కల్పించిన ఆదివాసీ హక్కులు, షెడ్యూల్డ్ ఏరియా చట్టాలు, పీసా చట్టం, 1/70 భూ బదిలీ నియంత్రణ వంటి చట్టాల పరిరక్షణ కోసం ప్రశ్నిస్తున్న ఆదివాసీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధికి తగదని అన్నారు....