పార్కలగండి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉద్దీపకం-3 పుస్తకావిష్కరణ

  గిరిజన విద్యార్థుల సంక్షేమానికి ఐటీడీఏ ప్రత్యేక దృష్టి....! పొలిటికల్ పవర్, ఆగస్టు 18: దమ్మపేట:గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తూ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్, డీడీ, ఏటీడీఓ అధికారుల ఆదేశాల మేరకు దమ్మపేట మండలం పార్కలగండి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉద్దీపకం-3 పుస్తకావిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమరం సుశీల, ప్రధానోపాధ్యాయులు రవి , ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు....