*ఆలయాల పవిత్రతను కాపాడేదెవరు?.ఆలయ పరిసరాల్లో చెత్త చేదారాలతో దుర్గంధం*

మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఇంచార్జ్ ఏ.పాండు రంగారావు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కీసర సర్కిల్ : జవహర్ నగర్ : స్థానిక గబ్బిలాలపేటలోని ఈదమ్మ - ఎల్లమ్మ గుడి, పెద్దమ్మ గుడి పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో భక్తులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ధూప, దీప నైవేద్యాలతో పూజలు అందుకోవాల్సిన ఆరాధ్యదేవతల ఆలయాల ముందు కుళ్లిపోయిన వ్యర్థపదార్థాలు, తడి పొడి చెత్త దర్శనమిస్తుండటంతో ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు చెందిన కొందరు తమ ఇళ్లలోని తడి పొడి...