మహిళల భద్రతే లక్ష్యం.. గ్రామాల్లో బిక్కవోలు పోలీసుల మైక్ ప్రచారం
పొలిటికల్ పవర్ న్యూస్ అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి, బిక్కవోలు, ఆగస్టు 03: మహిళలపై జరిగే నేరాల నివారణతో పాటు వారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బిక్కవోలు పోలీసులు సోమవారం కొమరిపాలెం, తోస్సిపూడి గ్రామాల్లో విస్తృత మైక్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలపై జరిగే వేధింపులు, గృహ హింస, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎలాంటి అనుమానాస్పద ఘటనలు ఎదురైనా లేదా ఇబ్బందులు కలిగినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా అత్యవసర...